ఇల్లందు ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలం పరిశీలించిన కలెక్టర్ అంకిత్

3చూసినవారు
ఇల్లందు ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలం పరిశీలించిన కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, ఇల్లందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. హైకోర్టు ఆదేశాల మేరకు, సాగుదారులు సూచించిన సర్వే నంబర్ పరిధిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు రెండు రోజులుగా సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్థలాన్ని పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు తాసిల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్