అటవీ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలీ..కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ అటవీ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంగళవారం తెలిపారు. అటవీ ఆక్రమణల తొలగింపు వంటి సున్నితమైన పనులకు పోలీస్ శాఖ సహకారాన్ని ముందుగానే తీసుకోవాలని, సిబ్బందిపై దాడులు, బెదిరింపులు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.