నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

44చూసినవారు
నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
పాల్వాయి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ముదిరాజులను (BC-D) నుండి (BC-A) చేర్చి ప్రకటన ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు భారీ బైక్ ర్యాలీతో (కలెక్టర్)ఆఫీస్ కి వెళ్లి ముట్టడి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. 23 మండలాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, మహిళలు, యువకులు, జోరు వర్షం సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ కి సమస్యలపై వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్ వ్యాప్తంగా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్