భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ పేద జర్నలిస్టు కుటుంబాలకు ఇంటి స్థలాలు, ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి సమస్యలను రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం జర్నలిస్టులకు అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.