కొత్తగూడెం జిల్లా, పాల్వంచలోని మారుతీనగర్ 35వ డివిజన్ కార్పొరేటర్ నామ కీర్తి తన జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మారుతీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం చేసి, తాంబూలాలు, పండ్లు, గాజులు సమర్పించారు. అంగన్‌వాడీ విద్యార్థులకు స్లేట్లు, కుర్చీలను కార్పొరేటర్ స్వహస్తాలతో అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని, డివిజన్ ప్రజల ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని కార్పొరేటర్ నామ కీర్తి తెలిపారు.