
పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్: మోడీ
పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ నేపథ్యంలో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. ఇథనాల్ వాడకం పెరిగితే రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు.




