అర్నాబ్ తుపాను బీభత్సం-అల్లకల్లోలమవుతున్న ఏజెన్సీ ప్రాంతాలు

1361చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో గురువారం అర్నాబ్ తుపాను బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండవద్దని, లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్