పాల్వంచ ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్

2చూసినవారు
పాల్వంచ ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని ఇందిర నగర్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన, సహాయ సంక్షేమ శాఖ అధికారి ఎస్. చంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, సిలబస్ పూర్తయిందా అని అడిగి తెలుసుకున్నారు. 8, 9వ తరగతి విద్యార్థుల విద్యా ప్రగతి, 3 నుంచి 7వ తరగతి విద్యార్థుల చదువును కూడా వారు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్