డీజిల్, పెట్రోల్ కొరత: కేంద్రంపై CPIML(న్యూడెమోక్రసీ) ఆగ్రహం

1651చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచనాపల్లిలో CPIML(న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో రైతులు, పార్టీ నాయకులు ట్రాక్టర్లను తాళ్లతో లాగుతూ గ్రామంలో బీసీ కాలనీలో ఆందోళన చేశారు. డ్రైవర్లకు, రైతులకు డీజిల్, పెట్రోల్ కొరత వల్ల నష్టం కలుగుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉందని CPIML న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పూనెం రంగన్న, ND కాంచనపల్లి కార్యదర్శి అటీకం శేఖర్ ఆరోపించారు. ఇదే ఆసరాగా చేసుకున్న దళారులు 300 రూపాయలకు బ్లాక్‌లో అమ్ముతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ కొరతను లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్