ఏఎస్ఐగా పదోన్నతి పొందిన గని, రఘురామ్ రెడ్డికి డీఎస్పీ అభినందనలు
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏఎస్ఐగా పదోన్నతి పొందిన గని, రఘురామ్ రెడ్డిని శుక్రవారం పాల్వంచ డీఎస్పీ సతీష్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్ఐగా పదోన్నతి పొందడం సంతోషకరమని డీఎస్పీ అన్నారు. ఇదే విధంగా నీతి, నిజాయితీలతో, బాధితుల పట్ల క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.