రాజీవ్‌ పార్కు వద్ద అండర్‌పాస్‌పై క్షేత్రస్థాయి పరిశీలన

1చూసినవారు
రాజీవ్‌ పార్కు వద్ద అండర్‌పాస్‌పై క్షేత్రస్థాయి పరిశీలన
కొత్తగూడెం పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజీవ్‌ పార్కు వద్ద రైల్వే అండర్‌పాస్‌ నిర్మాణానికి సంబంధించి కదలిక మొదలైంది. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభ్యర్థన మేరకు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం రైల్వే ట్రాక్‌ వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ అండర్‌పాస్‌ నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్