భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని పంజాబ్ గడ్డ 18వ డివిజన్లో ఆదివారం గణపతి మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 18వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంజాబ్ గడ్డ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడు వారి కుటుంబాలపై చల్లని చూపు చూడాలని, చదువుకున్న పిల్లలకు ఉన్నతమైన
ఉద్యోగాలు రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.