ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు మోసం చేసిన కాకినాడకు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి బాలాజీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.