
ఉరివేసుకొని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధారూర్ మండలం స్టేషన్ ధారూరులో మహిళా కానిస్టేబుల్ తులసి బాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.




