భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శుక్రవారం దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ, శాస్త్రీజీ చేపట్టిన అహింసా మార్గమే భారతావనికి ఆదర్శమని, మార్గదర్శకమని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల అన్నారు. వీరి జయంతి సందర్భంగా పాల్వంచలో పలుచోట్ల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లలితకుమారి,
కాంగ్రెస్ నాయకులు నూకల రంగారావు, గంగిరెడ్డి భువనసుందర్ రెడ్డి, జాలె జానకి రెడ్డి, కొండం వెంకన్న గౌడ్, ఎస్.ఎ. ఈజీల్, చీకటి కార్తీక్, మహీపతి రామలింగం, వై. వెంకటేశ్వరరావు, సాదం రామకృష్ణారావు, పెండ్యాల శ్రీనివాస్, నరిగె సుజాత, పెండ్యాల రోజాలక్ష్మి పాల్గొన్నారు.