భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 16. 7 అడుగులుగా ఉన్న నీటిమట్టం శుక్రవారం రోజు ఉదయం 6 గంటలకు 17. 80 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి విడుదల 1, 39, 136 క్యూసెక్కులు. రానున్న 24 గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.