భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గణనాథుని నిమజ్జనం సందర్భంగా పూజ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సూపర్ బజార్ సెంటర్లో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ఎర్రకామేష్ అధ్యక్షత వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా
కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, మేయర్ మూడు గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి సహా పలువురు రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు, సర్పంచులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.