దసరా రోజున 5,000 ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
దసరా పండుగ రోజున సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని నిరుపేదల కోసం తానా ఫౌండేషన్ రూ. 300 కోట్లతో 5,000 ఇళ్ల నిర్మాణానికి శనివారం భూమిపూజ జరగనుంది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుండగా, దాతృత్వ సంస్థలు కూడా ప్రభుత్వంతో చేతులు కలపడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేదల సొంత ఇంటి కల నెరవేరనుంది.