పాల్వంచలోని స్టార్ చిల్డ్రన్ స్కూల్లో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో 'హిందీ అవుట్ రీచ్' కార్యక్రమం జరిగింది. హిందీ రాజభాష దినోత్సవ వేడుకల్లో భాగంగా డిగ్రీ కళాశాల హిందీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ టి అరుణ కుమారి హిందీ భాష ప్రాముఖ్యత, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జి. భాస్కర్ రావు, అధ్యాపకులు,
విద్యార్థులు పాల్గొన్నారు.