హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు ఏఎస్ఐగా పదోన్నతి: కమిషనర్ అభినందనలు
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుల్ శాంపురి శ్రీనివాసరావు ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఐపీఎస్ ఆయనకు ర్యాంక్ అలంకరించి అభినందించారు. మధిర రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు, తన నిబద్ధతతో ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. గతంలో పాల్వంచ సీఐకి గన్ మెన్ గా పనిచేసిన ఆయనకు, కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కటుకూరి శేఖర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.