భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట వద్ద బుధవారం రాత్రి భారీ వర్షాల కారణంగా వాగు బ్రిడ్జి నేలమట్టం కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో అశ్వారావుపేట నుంచి ములకలపల్లికి వెళ్లే మార్గం మూసుకుపోయింది. బ్రిడ్జిని తిరిగి నిర్మించడానికి సమయం పడుతుందని స్థానికులు తెలిపారు. ప్రయాణికులు అటువైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.