
పొరపాటున రూ. 10 కోట్లు జమ.. నిజాయితీ చాటిన మహిళా రైతు రీటా
యూపీలోని మైన్పురి జిల్లాకు చెందిన మహిళా రైతు రీటా ఖాతాలో పొరపాటున దాదాపు రూ. 10 కోట్లు జమ అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన రీటా వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించి, ఆ సొమ్ము తనది కాదని తెలిపారు. తన కుటుంబ సభ్యులకు కూడా బ్యాంకులో ఉన్న సొంత డబ్బును కూడా తాత్కాలికంగా ముట్టుకోవద్దని ఆదేశించారు. తన అసాధారణ నిజాయితీతో రీటా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. కష్టపడి సంపాదించిన రూపాయికే విలువ ఉంటుందని ఆమె నిరూపించారు.




