డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయి .. కనకేష్‌

0చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని పాల్వంచ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్‌ పటేల్‌ సోమవారం ఆరోపించారు. 2023లో డ్రా ద్వారా ఎంపికైన 380 మందిని పక్కనపెట్టి, ఇటీవల 360 మందికి కొత్తగా డ్రా నిర్వహించడంపై ఆయన ప్రశ్నించారు. పాత లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించి, కొత్త డ్రాను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అధికారులు స్పష్టమైన వివరాలు వెల్లడించాలని కోరారు.

సంబంధిత పోస్ట్