భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పరిధిలోని శ్రీనివాస బంజారా కాలనీలో నివాసం ఉంటున్న వికలాంగురాలు బత్తుల నాగమణికి, గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న
జనసేన పార్టీ పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ బ్రహ్మం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, మెగా అభిమానులు, దాతల సహకారంతో బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, నగదు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేవాగౌడ్, మెగాఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాసీం, సాయి, భాస్కర్, శ్యామ్, రవీందర్ నాయక్, జనసైనికులు పాల్గొన్నారు.