ఏజెన్సీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఏజెన్సీ చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. 1/70 చట్ట ప్రకారం గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు ఉండవని అన్నారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇందిరమ్మ ఇళ్లు గిరిజనేతరులకు మంజూరు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.