ఖమ్మం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల

10చూసినవారు
ఖమ్మం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంచుకొండ, బుగ్గవాగు ఎత్తిపోతల పథకాలు, మున్నేరు రక్షణ గోడ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అక్టోబర్ నుండి జూన్ వరకు పనుల సీజన్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని, రబీకి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సెప్టెంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని, ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని తెలిపారు. వెలుగుమట్ల కాలనీని నవంబర్ 21లోగా అన్ని మౌలిక వసతులతో ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలని, ఖమ్మం నగర విద్యుత్ అవసరాలపై పదేళ్ల ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్