
పూజారి అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టిన మహిళలు (వీడియో)
ఉత్తరప్రదేశ్లోని వారణాసి గంగానది ఘాట్లో దారుణం చోటు చేసుకుంది. పడవలో ఉన్న ఇద్దరు మహిళలతో ఓ పూజారి అసభ్యంగా ప్రవర్తించాడు. తమ బట్టలు లాగుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత మహిళలు ఆరోపించారు. ఈ క్రమంలో మహిళలిద్దరూ కలిసి పూజారిపై దాడి చేశారు. దాంతో పూజారి పడవ నుంచి గంగానదిలోకి దూకేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.




