కలెక్టరేట్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు
తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో ఆదివారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ IAS బాపూజీ చిత్రపటానికి దండ వేసి, ఆయన సేవలను కొనియాడారు. 1915 సెప్టెంబర్ 27న జన్మించిన బాపూజీ, స్వాతంత్ర ఉద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.