ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు
కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలో కటుకూరి శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగాయి. నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన బాపూజీ, కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1971 వరకు శాసనసభ్యుడిగా కొనసాగి, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని త్యజించిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 2009-12 తెలంగాణ ఉద్యమాలలోనూ పాల్గొన్నారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషి చేశారు.