కొత్తగూడెం: 1708మందిని కుష్టు వ్యాధి అనుమానితులు గుర్తింపు

5చూసినవారు
కొత్తగూడెం: 1708మందిని కుష్టు వ్యాధి అనుమానితులు గుర్తింపు
జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే జనవరి 31న ముగిసిందని, మొత్తం 1708 మందిని కుష్టు వ్యాధి అనుమానితులుగా గుర్తించామని డిఎమ్హెచ్ఓ తుకారాం రాథోడ్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, ఉప కేంద్రాల్లో డీపీఎంఓలు పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1013 మందిని పరీక్షించగా, 22 మందిని వ్యాధిగ్రస్థులుగా నిర్ధారించినట్లు ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్