సింగరేణి సంస్థల్లో మెడికల్ బోర్డు కారుణ్య నియామకాలను ఎత్తివేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ ఆరోపించారు. శుక్రవారం కొత్తగూడెం టౌన్ రామవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని విమర్శించారు. గతంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరుతో 20 వేల మందిని, డిస్మిస్ పేరుతో మరో పదివేల మందిని తొలగించారని ఆయన పేర్కొన్నారు.