కొత్తగూడెం: అంగన్వాడి సేవలు విస్తృతపరచాలి

5చూసినవారు
కొత్తగూడెం: అంగన్వాడి సేవలు విస్తృతపరచాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి క్షేత్రస్థాయిలో అంగనవాడి సేవలను విస్తృతపరచాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారి జె. స్వర్ణలత లెనినా అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని సిడిపివోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. అంగనవాడి సేవలను మెరుగుపరచడానికి నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్