జూన్ 5 నుండి 12, 2026 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి కార్యాలయం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.