కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గురువారం 54వ డివిజన్లో మాదాసు పద్మ నేతృత్వంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.