కొత్తగూడెం: డాగ్ స్క్వాడ్ తో గంజాయి తనిఖీలు

2చూసినవారు
కొత్తగూడెం: డాగ్ స్క్వాడ్ తో గంజాయి తనిఖీలు
కొత్తగూడెం అర్బన్: ఎస్సీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు మంగళవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి హాట్‌స్పాట్‌లలో డాగ్ స్క్వాడ్‌తో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలను ఉపయోగించినట్లు త్రీ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా, రవాణా లేదా వినియోగం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్