సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో, జిల్లాలో కోడి పందేల సందడి ప్రారంభమైంది. అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు, బూర్గంపాడు మండలాల్లోని ఆయిల్పామ్ తోటల్లో పుంజులు పందేలకు సిద్ధమవుతున్నాయి. రెండు, మూడు నెలల ముందు నుంచే వీటికి బలవర్ధకమైన ఆహారం అందిస్తూ, ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోడి రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. పందేల రాయుళ్లు ఇప్పుడు కోళ్ల కొనుగోళ్ల కోసం తోటల బాట పడుతున్నారు.