జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతను పర్యవేక్షించేందుకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈ సందర్శన జరిగింది. ఈ సందర్భంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును కూడా ఆయన పరిశీలించారు.