కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతను పర్యవేక్షించేందుకు మూడు నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఈవీఎం గోడౌన్ ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.