కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీలో భాగంగా ఈ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు.