రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆరోపించారు. కొత్తగూడెం ఒకేషనల్ కళాశాలలో టీపీటీఎఫ్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యారంగానికి నిధుల కేటాయింపును తగ్గించి, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.