కొత్తగూడెం: ఇద్దరు బాలికల అదృశ్యం కలకలం

8చూసినవారు
కొత్తగూడెం: ఇద్దరు బాలికల అదృశ్యం కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలోని శివలింగాపురం బాలసదనం నుండి శనివారం ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. భద్రాచలంకు చెందిన ఈ బాలికలు బాల్య వివాహాలు చేసుకోవడంతో వారిని బాలసదనంలో చేర్చారు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తున్నామని చెప్పి, బాలికల సదనం గోడ దూకి వెళ్లిపోయారు. వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.