ఈ నెల 12న మధ్యాహ్నం 3 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం ఐడిఓసీలో దిశ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. దిశ కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.