జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఆర్‌డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన ఈ తనిఖీలో గోడౌన్ భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ముందుగా గోడౌన్ సీల్‌ను పరిశీలించిన కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో సీల్‌ను తెరిపించి గోడౌన్‌లోకి ప్రవేశించారు. ఈవీఎంల భద్రతపై ఆయన ఆరా తీశారు.