కొత్తగూడెం: విద్య జీవితాన్ని మార్చే ఆయుధం

2చూసినవారు
కొత్తగూడెం: విద్య జీవితాన్ని మార్చే ఆయుధం
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం మాట్లాడుతూ, విద్య జీవితాన్ని మార్చే ఆయుధం అని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 షెడ్యూల్డ్ కులాల వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న 212 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్