మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల వ్యయపరిశీలకురాలు లావణ్య సూచించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఎంఈఓలు, తహసీల్దార్లు, సర్వే లెన్స్ బృందాలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టకుండా నియంత్రించాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని ఆమె స్పష్టం చేశారు.