కొత్తగూడెం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు వంటి పలు సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.