సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) డైరెక్టర్ గా గౌతమ్ పోట్రు నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. గౌతమ్ పోట్రు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా, సెర్ప్ సీఈవోగా విధులు నిర్వహించారు. గౌతమ్ పోట్రు 2017 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి గతంలో భద్రాచలం ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తించారు.