జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిన్నింగ్ మిల్లుల యాజమాన్య ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిసిఐ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 6వ తేదీ నుండి జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో, మిల్లులను యథాతథంగా కొనసాగించాలని ఆయన ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు.