భద్రాచలం గోదావరి ఘాట్ వద్ద నిర్వహించిన నది హారతి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం తెలిపారు. ప్రజల సౌకర్యం, స్థానిక సంప్రదాయాల పరిరక్షణ, అలాగే కార్యక్రమానికి మరింత విస్తృత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఇకపై ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.