సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, జిల్లాలో కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉపన్యాస పోటీలు, స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, యువతకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.